పురుషుల కోసం ప్రత్యేక ప్లాటినం ఆభరణాలు



పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాటినం ఆభరణాలను ప్రముఖ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆవిష్కరించారు. ప్లాటినం గిల్డ్‌ ఇండియా రూపొందించిన అద్భుతంగా రూపొందించిన ఈ ఆభరణాలలో ప్లాటినం గొలుసులు, ఉంగరాలు, బ్రాస్‌లేట్‌ తదితరాలెన్నో వున్నాయని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రతిరోజూ కొత్త సవాళ్లతో, కఠినమైన నిర్ణయాలను కొన్ని క్షణాల్లోనే తీసుకోవాల్సి వుంటుందని, ఆ కీలక క్షణాల్లోనే మన పాత్ర, మన విలువ పరీక్షించబడుతుందన్నారు. తనకు తన శైలికి ప్లాటినం సరిగ్గా సరిపోతుందన్నారు. ఇదిలా వుండగా ప్లాటినం ఆభరణాలు  ప్రముఖ షోరూంలలో అందుబాటులో వున్నాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org