ఆమె ఫిట్టింగ్‌ మాస్టర్‌



బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ అప్పుడే నాలుగు వారాలను పూర్తిచేసుకొని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. నాలుగో వారంలో హౌజ్ నుంచి నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చాడు. హౌజ్‌‌లో తనకి తాను సింహం అని ప్రకటించుకున్న మాస్టర్.. తొందరగానే హౌజ్ నుంచి బయటకు వచ్చారు. తాజాగా మాస్టర్‌.. బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూలో హౌజ్ లోని కంటెస్టెంట్లందరూ ఎలాంటివారో పూసగుచ్చినట్లుగా వివరించాడు. దీనికి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ముందుగా విశ్వతో పాటు మరో కంటెస్టెంట్‌ ఫొటోను కింద పడేసి కాలితో తన్నేశాడు. ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్‌ గురించి మాట్లాడాడు.. యాంకర్ రవి టాస్క్ ఇచ్చినప్పుడు నత్తలాగా, నామినేషన్స్‌లో గుంటనక్కలాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. ఇక ప్రియను ఫిట్టింగ్‌ మాస్టర్‌ అని, జెస్సీ పిల్ల బచ్చా, శ్రీరామచంద్ర ముద్దపప్పు, షణ్ముఖ్‌ పరమానందయ్య శిష్యుడని అన్నాడు. 'మీరు మైక్‌ ధరించండి, చెవుల్లో మాట్లాడకూడదు' అన్న హెచ్చరికలు కాజల్‌నుద్దేశించే వస్తాయని తెలిపాడు. లోబో చేసేది డ్రామా అంటూ నొక్కి చెప్పాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org