బిఎస్ఎన్ఎల్ 397 కే సంవత్సరం వ్యాలిడిటీ

 


బిఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కొత్త ఆఫర్లు మరియు ప్లాన్స్ తో తన కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో కూడా చాలా బెస్ట్ అన్ లిమిటెడ్ ప్లాన్స్ అందించింది. అయితే, తక్కువ రీఛార్జ్ తో ఎక్కువ వ్యాలిడిటీ మరియు ఉచిత డేటా అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేసే బెస్ట్ ప్లాన్లను కూడా బిఎస్ఎన్ఎల్ అందించింది . వాటిలో, కేవలం 397 రూపాయలకే పూర్తి సంవత్సరం వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్ ను బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కగడితే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. ఈ ఆఫర్ ముందు నుండే అందుబాటులో వుంది మరియు బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ఆఫర్లతో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి.బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా ఒక సంవత్సరం వాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఈ అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్ మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు ఎస్ఎంఎస్ సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org