టాటా కార్లపై భారీ రాయితీలు !


టాటా మోటార్స్‌ కార్లపై భారీ రాయితీలను ప్రకటించారు. జులై 31 వరకు గానీ, లేదా స్టాక్‌ ఉన్నంత వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. ఈ ఆఫర్లతో వినియోగదార్లకు అత్యధికంగా రూ.65,000 వరకు లబ్ధి చేకూరనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. ఈ ఆఫర్లు హారియర్‌, టియాగో, టిగోర్‌,నెక్సాన్‌ మోడల్స్‌కు వర్తిస్తాయి. మిగతా కార్లపై మాత్రం ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదు. టియాగో హ్యాచ్‌ బ్యాక్‌పై రూ.25,000 వరకు తగ్గింపు వర్తిస్తుంది. అంతేకాదు దీనిపై ఎక్స్‌ఛేంజి ఆఫర్‌  కింద రూ.10వేల తగ్గింపు కూడా పొందవచ్చు, టిగారో సబ్‌కాంపాక్ట్‌ సెడాన్‌పై అత్యధికంగా రూ.30వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీనిలో రూ.15వేలు కన్జ్యూమర్‌ డిస్కౌంట్‌, రూ.15 వేలు ఎక్స్‌ఛేంజి బోనస్‌ ఉన్నాయి, నెక్సాన్‌ సబ్‌ కాంపాక్ట్‌ వాహనంపై రూ.15వేల తగ్గింపును ప్రకటించింది. ఇది కేవలం డీజిల్‌ వెర్షన్‌ వాహనంపై మాత్రమే వర్తిస్తుంది., 5 సీటర్‌ హారియర్‌ వెర్షన్‌పై అత్యధిక డిస్కౌంట్‌ లభిస్తోంది. అత్యధికంగా రూ.65వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీనిలో కన్జ్యూమర్‌ స్కీమ్‌ కింద రూ.25 వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ కింద రూ.40 వేలు లబ్ధి లభించనుంది. ఇది డార్క్‌ ఎడిషన్‌, కామో ఎడిషన్‌, ఎక్స్‌జెడ్‌ప్లస్‌, ఎక్స్‌జడ్‌ప్లస్‌ఏ వేరియంట్లపై వర్తించదు. ఈ వేరియంట్లపై రూ.40వేల వరకు మాత్రమే తగ్గింపులు లభిస్తాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org