ఎఫ్‌జెడ్‌ 25 ధర రూ.1,36,800

 

ఇండియా యమహా మోటార్‌  ఎఫ్‌జెడ్‌ 25 మోడల్‌లో ‘మాన్‌స్టర్‌ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్‌’ను విడుదల చేసింది. దీని ధర రూ.1,36,800 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). ఈ నెలాఖరుకు వీటిని వినియోగదార్లకు అందుబాటులోకి తీసుకొస్తామని యమహా మోటార్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ మోటోఫుమి శితారా వెల్లడించారు. 

గ్లామర్‌ శ్రేణి మోటార్‌సైకిళ్లలో ఎక్స్‌టెక్‌ ఎడిషన్‌ను హీరో మోటోకార్ప్‌ విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్రమ్‌ వేరియంట్‌ రూ.78,900 కాగా, డిస్క్‌ వేరియంట్‌ రూ.83,500 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). గ్లామర్‌ ఎక్స్‌టెక్‌లో బ్లూటూత్‌ కనెక్టివిటీ, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్, ఇంటిగ్రేటెడ్‌ ఛార్జర్, సైడ్‌-స్టాండ్‌ ఇంజిన్‌ కటాఫ్, బ్యాంక్‌ యాంగిల్‌ సెన్సార్, లైట్‌-ఎమిటింగ్‌ డయోడ్‌ హెడ్‌ ల్యాంప్‌ తదితర సదుపాయాలుంటాయని కంపెనీ తెలిపింది.  

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org