Ad Code

యూనీకోడు టెక్స్ట్ అనూ టెక్స్ట్ మార్చడం ఎలా?


సత్వర అంచెలు
  1. ఈమాట గూటిలోని పరివర్తకం ద్వారా యూనీకోడు పాఠ్యాన్ని అను 6 లోకి మార్చండి.
  2. పరివర్తకం ద్వారా అను 6 నుండి అను 7లోకి మార్చండి.
  3. అను 7లోకి మారిన పాఠ్యాన్ని పేజిమేకరు 7 లోకి అతికించండి.
అంచె 1:
పలువురు కృషి ద్వారా అందుబాటులోకి వచ్చిన ఈమాట జాలగూడులోని యూనీకోడ్2ఫాంట్ పరివర్తన పుటను సందర్శించండి.

ఈ పుటలో మీరు రెండు పేటికలను గమనించవచ్చు.
ఎడమవైపు పేటికలో మీరు మార్చాలనుకుంటున్న యూనీకోడు పాఠ్యాన్ని అతికించి, కుడివైపు పేటిక పైన కనిపిస్తున్న సెలెక్ట్ అవుట్ పుట్ ఫార్మేటుపై నొక్కి అను (రంగేష్ కోన వెర్షన్)ను ఎంచుకుని క్రిందన ఇవ్వబడిన Transform బటనుపై నొక్కండి.
అంచె 2:
ఇప్పుడు పరివర్తనం చెందిన పాఠ్యాన్ని కుడివైపు పేటిక నుండి నకలుచేయండి.
ఇప్పుడు అను 7 అనువర్తనాన్ని తెరచి, క్రిందన ఇవ్వబడిన convert old text బటన్ పై నొక్కండి. ఇప్పుడు ఒక కొత్త కిటికీ తెరుచుకుంటుంది. అందులోని పై అరలో నకలుచేసిన పాఠ్యాన్ని అతికించి convert బటన్ నొక్కండి.
కొంత సమయం తరువాత తర్జుమా అయిన పాఠ్యాన్ని క్రింది అరలోనుంచి నకలు చేయండి.

అంచె 3:
అడోబ్ పేజిమేకర్ 7 తెరచి అందులో ఇంతకు ముందే నకలు చేసిన పాఠ్యాన్ని అతికించండి, వ్యవస్థ ఖతి (ఫాంటు) కోసం అడిగితే ప్రియాంక గానీ లేదా అనుపమను గానీ ఎంచుకోండి.

గమనిక: మీరు తీసుకున్న యూనీకోడు పాఠ్యంలో ఏమైనా చిహ్నాలు గానీ లేదా ఆంగ్ల అక్షరాలు గానీ ఉంటే అవి ఖతిలోని సంబంధిత తెలుగు అక్షరాలతో ప్రతిస్థాపించబడతాయి. 
అలాగే కొన్ని చోట్ల గుణింతాలు తప్పుగా పడవచ్చు.
అందువలన తర్జుమా చేసిన పాఠ్యాన్ని సరిచూసి, అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.

గమనిక 2: ఈ టపా కేవలం ముద్రణకు వేరే ప్రత్యామ్నాయం లేని వారిని దృష్టిలో ఉంచుకుని చేయడం జరిగింది.
యూనీకోడులో ముద్రణకు వనరులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకూ ముద్రణను యూనీకోడులో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.

Post a Comment

0 Comments

Close Menu