ఎనిమిది వేల రూపాయలకు చైనాలో కంప్యూటర్లు

ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల తయారీలో ప్రసిద్ధి చెందిన లినోవా గ్రూప్‌ అతి తక్కువకే 199 డాలర్లుకు (సుమారు ఎనిమిది వేల రూపాయలకు) చైనాలోని గ్రామీణ ప్రాంతాల వారికి కంప్యూటర్లు అందజేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఒక రకంగా ప్రపంచ కంప్యూటర్‌ తయారీ సంస్థల్లో సంచలనాన్ని కలగజేస్తోంది. ఎందువల్ల అంటే.. ఓ పక్కన ఐఓసిఎల్‌ 100డాలర్ల ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చి తక్కువకే ల్యాప్‌టాప్‌లను అందజేస్తున్నటువంటి సమయంలో అమెరికాలో అగ్రశేణి కంపెనీ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. దీనివల్ల భవిష్యత్‌లో చెప్పుకోదగిన స్థాయిలో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగంలో మార్పులు జరగవొచ్చునని అందరూ భావిస్తున్నారు. దీనిపై లినోవా చైనా ప్రతినిధి మాట్లాడుతూ-ఇది టెక్నాలజీ విప్లవంగా అభివర్ణించాడు. త్వరలో బీజింగ్‌లో జరగనున్న ఒలంపిక్‌ క్రీడలకు సంబంధించిన సమాచారాన్ని నెట్‌లో వీక్షించాలనుకునే దేశప్రజలకు ఇంత తక్కువ ధరలో కంప్యూటర్స్‌ లభించటం ద్వారా వారు ఒలంపిక్‌ క్రీడలను ఆస్వాదిస్తారు అని తెలిపారు. కంపెనీ ప్రధానంగా రైతులను, ఇతర విద్యార్థి వర్గాలను ప్రధాన లక్ష్యంగా చేసుకొని దీన్ని రూపొందించినట్లు తెలిపింది.

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. Lenevo is a Chinese company that bought IBM.

      Delete

Telugu Unicode Converter Online

click here http://kolichala.com/font2unicode/Encoder/unicode2font.php

Powered by Blogger.