సాదిక్‌ఖాన్‌కు వందకు పైగా ప్రశ్నలను సంధించిన పోలీసులు : జగదీశ్‌రెడ్డి హత్య అనుకోకుండా జరిగింది కాదని తేలింది

Friday, October 2, 2026

Andhra Pradesh Jagadish Reddy's Murder Was Premeditated kakinada Police Question Sadiq Khan Extensively who supplied the cyanide and other hazardous chemicals were brought face-to-face

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన జగదీశ్‌రెడ్డి హత్య కేసులో నిందితుడు సాదిక్‌ఖాన్‌కు పోలీసులు చేపట్టిన రెండోరోజు కస్టడీ విచారణ ముగిసింది. గడచిన రెండు రోజుల్లో నిందితుడి నుంచి సమాచారం రాబట్టేందుకు అధికారులు వందకు పైగా ప్రశ్నలను సంధించారు. జగదీశ్‌రెడ్డి హత్య అనుకోకుండా జరిగింది కాదని, పూర్తి పథకం ప్రకారమే పక్కాగా కుట్ర పన్ని అమలు చేసినట్లు తేలింది. సైనేడ్, ఇతర ప్రమాదకర రసాయనాలను అందించిన వ్యక్తులను స్వయంగా సాదిక్‌ఖాన్‌ ముందు కూర్చోబెట్టి ఎదురెదురుగా విచారించారు. రెండు విడతల్లో రూ. 60 వేల నగదు చెల్లించి సైనేడ్‌ తెప్పించుకున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. జగదీశ్‌రెడ్డికి విడతలవారీగా థాలియం సల్ఫైడ్‌ను అందించడంతో పాటు, అతడు క్రమం తప్పకుండా తీసుకునే ప్రోటీన్‌ పౌడర్‌లో సైనేడ్‌ కలిపి ఇచ్చినట్లు విచారణాధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కొన్ని అత్యంత కీలక ప్రశ్నలకు సాదిక్‌ఖాన్‌ నేరుగా సమాధానాలు చెప్పకుండా దాటవేసేందుకు ప్రయత్నించాడని, మరికొన్ని విషయాల్లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని సమాచారం. కోర్టు అనుమతించిన కస్టడీ సమయం శనివారం ఉదయం 11:30 గంటలకు ముగియనుంది. దీంతో సాదిక్‌ఖాన్‌ను వైద్య పరీక్షల అనంతరం కాకినాడ కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ