రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసు : నలుగురికి జీవిత ఖైదు విధించిన టోంక్ జిల్లా ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు

Friday, October 2, 2026

national Sensational Honor Killing Case in Rajasthan Tonk District Special SC/ST Court Sentences Four to Life Imprisonment

t f B! P L

రాజస్థాన్‌లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లికి పట్టుబడిందనే కక్షతో యువతిని పథకం ప్రకారమే హతమార్చిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి టోంక్ జిల్లా ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితుల్లో తల్లి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జైపూర్‌కు చెందిన సుమన్ (25), ప్రధాన్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో ప్రధాన్ పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు. సుమన్ మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని ప్రధాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కుట్ర పన్నాడు. 2022లో శ్రాద్ధ కార్యక్రమం ఉందని చెప్పి సుమన్‌ను తమ గ్రామానికి రప్పించి, బలవంతంగా విషపూరిత రసాయనం తాగించారు. ఆ తర్వాత సుమన్‌ చనిపోయింది. ఈ ఘటనపై ఎవరికీ అనుమానం రాకుండా పాము కాటు వల్లే సుమన్ చనిపోయినట్లు నమ్మించారు. మూడు రోజుల తర్వాత ఆమె సోదరుడికి ఫోన్ చేసి అజ్మీర్‌కు రమ్మని చెప్పగా, అప్పటికే ఆమె మృతి చెందింది. పాము కాటుతోనే చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, సుమన్ ఏటీఎం కార్డు నుంచి ప్రధాన్ రూ. 80,000 డ్రా చేయడం, పోస్టుమార్టం నివేదికలో ఆమె విషం వల్లనే చనిపోయినట్లు తేలడంతో హత్య వెలుగులోకి వచ్చింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు 2023 మేలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 27 మంది సాక్షులు, 37 పత్రాలను పరిశీలించిన ప్రత్యేక న్యాయమూర్తి ఆర్తి మహేశ్వరి నేరస్థులు సంజన, ఆమె కుమారులు ప్రధాన్, సవాయ్ రామ్, కూతురు సుశీలకు జీవిత ఖైదుతో పాటు రూ. 1.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. తీర్పు సందర్భంగా జడ్జి కుల వ్యవస్థ, నమ్మకద్రోహంపై రాసిన పది లైన్ల కవితను తీర్పు కాగితంలో పొందుపరచడం విశేషం.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ