రాజాం మున్సిపాలిటీకి స్వచ్ఛ అవార్డు ప్రదానం

Saturday, October 3, 2026

Akurathi Ramachandra Rao received the award from State Chief Minister Rajam Municipality Receives Swachh Award Vizianagaram district of Andhra Pradesh

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా రాజాం పురపాలక సంఘం స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో కనబరిచిన పనితీరుకు ప్రతిష్టాత్మక స్వచ్ఛ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాజాం మున్సిపల్ కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు స్వీకరించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేర్పాటు, పరిసరాల పరిశుభ్రత, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం చేపట్టడం ద్వారా రాజాం పురపాలక సంఘం ఈ గుర్తింపును సాధించిందని అధికారులు తెలిపారు. రాజాం మున్సిపాలిటీకి స్వచ్ఛ అవార్డు రావడం పట్ల పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాజాం పట్టణానికి గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు. పురపాలక సంఘం సాధించిన ఈ విజయానికి కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు నాయకత్వంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ