ホーム
/
technology
/
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా ఎనర్జీ : పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంపు
Saturday, October 3, 2026
business Hike of ₹5 per Litre for Petrol and ₹3 per Litre for Diesel Nayara Energy Raises Petrol and Diesel Prices new rates came into effect on Saturday technology
ప్రైవేట్ రంగానికి చెందిన చమురు విక్రయ సంస్థ 'నయారా ఎనర్జీ' పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. ఈ కొత్త ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు, ఇంధన ధరలు తీవ్రంగా పెరగడం వల్ల కొనుగోలు వ్యయం అధికమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీకి ఉన్న 7,000కు పైగా పెట్రోల్ బంకుల్లో ఈ నూతన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. నయారా ఎనర్జీ ఈ ఏడాది ఇంధన ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు మార్చి నెలలో కూడా పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో, పెట్రోల్, డీజిల్‌పై ఇదే స్థాయిలో ధరలను పెంచింది. అయితే ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో జులైలో ఆ పెంపును వెనక్కి తీసుకుంది.
No comments:
Post a Comment