నలుగురు నకిలీ హిజ్రాలు అరెస్టు

Saturday, October 3, 2026

Four Fake Hijras Arrested intercepting motorists and forcibly collecting money while disguised as Hijras Jubilee Hills police skillfully arrested telangana

t f B! P L

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నకిలీ హిజ్రాల వసూళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. హిజ్రాల వేషంలో రోడ్లపై వాహనదారులను అడ్డుకుంటూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని 'ట్రూ బ్లాక్ కాఫీ' కేఫ్ కు ఓ యువకుడు తన కొత్త బీఎండబ్ల్యూ కారులో వచ్చాడు. కాఫీ తాగి తిరిగి వెళ్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు హిజ్రాల వేషధారణలో వచ్చి అతని కారును అడ్డుకున్నారు. కొత్త కారు కొన్నారంటూ రూ. 5,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న ఓ యూట్యూబర్ ఈ తతంగాన్ని తన కెమెరాలో బంధించి 'ఎక్స్' లో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన డీజీపీ సీవీ ఆనంద్ వెంటనే విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం జూబ్లీహిల్స్ నుంచి బోడుప్పల్ వరకు సుమారు 500కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ లను దాదాపు నెల రోజుల పాటు పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో బోడుప్పల్ ప్రాంతంలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో పట్టుబడిన నలుగురు వ్యక్తులు నిజమైన హిజ్రాలు కాదని, మగవారే హిజ్రాల వేషధారణ ధరించి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులను రమేష్ (40), సత్యనారాయణ (41), రమేష్ (42), యాదగిరి (44)లుగా గుర్తించారు. వీరంతా బోడుప్పల్లోని కాకతీయ కాలువనగర్ లో ఉంటున్నారు. ఈ ముఠా గత కొంతకాలంగా ఇదే విధంగా రోడ్లపై జనాలను అడ్డుకోవడం, కొత్తగా ప్రారంభించిన షాపులు, గృహప్రవేశాల వద్దకు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు  తరలించినట్లు జూబ్లీహిల్స్ అదనపు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇలాంటి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ