ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధాన్ని చాటుకుంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. తనను ఆంధ్రా బిడ్డగా భావించాలని, రాష్ట్రానికి తాను ఏం చేయగలనో మార్గనిర్దేశం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది. అనంత్ అంబానీ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆయనను అభినందించారు. అనంతరం సీఎం చంద్రబాబు అనంత్ అంబానీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రసంగించిన ముఖ్యమంత్రి అనంత్ అంబానీ చెప్పిన మాటలను స్పందించారు. అనంత్ అంబానీని ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగా భావిస్తున్నామని సీఎం వేదికపై ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో రిలయన్స్ సంస్థ మరింతగా భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశం సందర్భంగా సభలో వక్తల ప్రసంగాలకు ముందు ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమలో ఉద్యాన రంగం అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపు, నీటి వనరుల వినియోగం, ఆధునిక సాగు విధానాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల అవకాశాలను ఈ వీడియోలో వివరించారు. కార్యక్రమం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మొక్కలను నాటారు. అలాగే ఉద్యాన రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ホーム
/
Madanapalle
/
హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనంత్ అంబానీ
Friday, October 2, 2026
Anant Ambani a Key Attraction at the Horticulture Hub Inauguration Andhra Pradesh Annamayya district business Madanapalle
No comments:
Post a Comment