ホーム
/
technology
/
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో సరికొత్త రికార్డు సాధించిన మహీంద్రా : 'ఎక్స్' ద్వారా పంచుకున్న ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా
Friday, October 2, 2026
automobile Executive Chairman Anand Mahindra Shares the News on 'X' Mahindra Sets New Record in Electric Vehicle Sales national technology
మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. కంపెనీకి చెందిన 'బోర్న్ ఎలక్ట్రిక్' శ్రేణి ఎస్‌యూవీల అమ్మకాలు లక్ష యూనిట్ల కీలక మైలురాయిని దాటాయి. ఈ విజయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు. 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైన BE 6, XEV 9e మోడళ్ల బుకింగ్స్ తొలిరోజే 30,179 రిజర్వేషన్లు సాధించాయి. వీటి ఎక్స్‌షోరూమ్ విలువ రూ.8,472 కోట్లు కాగా, ఇందులో XEV 9e వాటా 56 శాతంగా నమోదైంది. అలాగే 73 శాతం మంది కస్టమర్లు టాప్ వేరియంట్ ను ఎంచుకున్నారు. 2025 మార్చి 20న డెలివరీలు ప్రారంభం కాగా, నవంబర్ 2025 నాటికే 30,000కు పైగా BE 6, XEV 9e వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. అనంతరం తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చిన XEV 9s డెలివరీలు 2026 జనవరిలో ప్రారంభమయ్యాయి. XEV 9e: 34,369 యూనిట్లు (అత్యధిక సేల్స్) BE 6: 20,108 యూనిట్లు, XEV 9s: 11,138 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్ లో 65,615 యూనిట్లు నమోదు కాగా, తదుపరి నెలల్లో డిమాండ్ ఊపందుకోవడంతో మొత్తం విక్రయాలు లక్ష మైలురాయిని చేరాయి. ఈవీల డిమాండ్ పెరగడంతో 2026 సెప్టెంబర్‌లో మహీంద్రా మొత్తం ఆటో విక్రయాలు 1,14,874 యూనిట్లకు (15% వృద్ధి) చేరాయి. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 1,83,397 యూనిట్లుగా నమోదు కావడంతో ఏడాది ప్రాతిపదికన 26 శాతం వృద్ధి నమోదైంది.
No comments:
Post a Comment