ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 150 స్థానాల కోసం పట్టుబడుతున్న కాంగ్రెస్

Friday, October 2, 2026

Congress Presses for 150 Seats national SP has proposed allocating 53–55 seats to the Congress There are six months remaining until theAssembly elections Uttar Pradesh Assembly elections

t f B! P L

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు ఉంది. ఈ లోపే పొత్తులు కుదుర్చుకోవాలనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతిపక్షంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 53-55 సీట్లు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదించింది. అయితే, తమకు 150 సీట్లు కావాల్సిందే అని కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇంకా రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే అధికారంలో ఉంది. బీజేపీకే సొంత మెజారిటీ కూడా ఉంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన బీజేపీ ఇంకా బలంగానే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఓడించాలంటే ఒంటరిగా పోటీ చేస్తే ప్రయోజనం లేదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఎదుర్కోవాలంటే ఉమ్మడిగా పోటీ చేయడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చాయి. ఇందుకోసం యూపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఎస్పీ, ఆ తర్వాత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, సీట్ల విషయంలోనే రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడం లేదు. యూపీ అసెంబ్లీలో 403 సీట్లు ఉండగా, మెజారిటీ కోసం 202 సీట్లు కావాలి. ఎన్నికలకు ముందుగానే కలిసి పోటీ చేసే అంశంపై పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. సీట్ల విషయంలోనే ఏకాభిప్రాయం కుదరడం లేదు. అయితే, 403 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 55 వరకు సీట్లు మాత్రమే ఇస్తామని ఎస్పీ చెబుతోంది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యూపీలో అంత బలంగా లేదని ఎస్పీ అంటోంది. అందుకే, కాంగ్రెస్‌కు భారీ సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సిద్ధంగా లేదు. ఇటీవలి కాలంలో యూపీ సహా అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ వరుసగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. అందుకే, ఆ పార్టీ ఇప్పుడున్న స్థితికి తక్కువ సీట్లే ఇవ్వడం కరెక్ట్ అన్నది ఎస్పీ వాదన. దీంతో ఎస్పీ దాదాపు 350 సీట్లలో పోటీ చేయాల్సి వస్తుంది. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యూపీ నుంచి 6 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ లోక్‌సభ స్థానాల పరిధిలో 30 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉంటాయి. వీటికి ఇంకొన్ని సీట్లు కలిపి 55 వరకు ఇవ్వాలని ఎస్పీ భావిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ తమకు 150 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. అప్పట్లో ఎస్పీ 298, కాంగ్రెస్ 105 సీట్లలో పోటీ చేశాయి. ఇందులో ఎస్పీ 47 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలిచాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ