చెరువులో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

الأحد، 27 سبتمبر 2026

Akbarpet-Bhumpally Mandal Bodies of Men Who Went Missing in Tank Recovered crime Rudraram village Siddipet district telangana

t f B! P L

తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో శనివారం జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాంతమైంది. స్థానిక పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన పారా రమేష్ (38), కలాల నవీన్ (26) ల మృతదేహాలు ఆదివారం ఉదయం లభ్యమయ్యాయి. దుబ్బాక సీఐ రాజేష్, మిరుదొడ్డి ఎస్సై సతీష్, పోలీసు సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి వీరి మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. మృతుల్లో పారా రమేష్ (38)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రమేష్ అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. భర్త శవాన్ని చూసి భార్య, తండ్రి లేడనే విషయం తెలియని చిన్న పిల్లలు ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. మరో మృతుడు కలాల నవీన్ (26)కు ఇంకా వివాహం కాలేదు. చేతికందివచ్చిన కొడుకు నూరేళ్ల జీవితం ఇలా మధ్యలోనే ముగిసిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో రుద్రారం గ్రామం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ