తెలంగాణలో 41 కొత్త బార్‌లకు నోటిఫికేషన్ విడుదల : దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12
الأحد، 27 سبتمبر 2026
Application Deadline is October 12 majority of these 41 bars are located within the Hyderabad Core Urban Region Notification Issued for 41 New Bars in Telangana telangana tgbcl.telangana.gov.in
తెలంగాణ ప్రభుత్వం కొత్త బార్ లైసెన్స్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 41 బార్ లైసెన్స్‌లను నోటిఫై చేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. జనాభా ఆధారంగా నిర్ణయించిన బేసిక్ ఎక్సైజ్ టాక్స్ స్లాబ్ ప్రకారం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు అక్టోబర్ 12 చివరి తేదీగా ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ పరిధిలోని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లో అత్యధికంగా 14 బార్‌లను నోటిఫై చేశారు. ఈ ప్రాంతానికి బీఈటీ స్లాబ్‌లను వర్తింపజేశారు. మొత్తం 41 బార్‌లలో అత్యధిక సంఖ్య హైదరాబాద్ కోర్ జనాభా ఆధారంగా స్లాబ్ రేటును రూ.44 లక్షలుగా నిర్ణయించారు. ఇతర ప్రాంతాల్లో రూ.30 లక్షలు, రూ.42 లక్షల స్లాబ్‌లను వర్తింపజేశారు. మొత్తం 41 బార్‌లలో అత్యధిక సంఖ్య హైదరాబాద్ టీకోర్ పరిధిలోనే ఉంది. హైదరాబాద్ – 14, అసిఫాబాద్ – 1,అలియాబాద్ – 1, ముదుచింతలపల్లి – 2, ఎల్లంపేట – 2, అశ్వారావుపేట – 1, కల్లూరు – 1, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ – 1, మక్తల్ – 1, దేవరకద్ర – 1,మద్దూర్ – 1, గడ్డపోతారం – 1, గుమ్మడిదల – 2, కోహిర్ – 1, బోధన్ – 1, బిచ్కుంద – 1, చేవెళ్ల – 1, మొయినాబాద్ – 2, కొడంగల్ – 1, పరిగి – 1, నర్సంపేట – 1, స్టేషన్ ఘన్‌పూర్ – 1, కేసముద్రం – 1, ములుగు – 1. అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులు నిర్ణీత నిబంధనల ప్రకారం దరఖాస్తులు సమర్పించాలి. లైసెన్స్‌కు సంబంధించిన అర్హతలు, షరతులు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలను తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిక వెబ్‌సైట్ tgbcl.telangana.gov.inలో పరిశీలించవచ్చు.
ليست هناك تعليقات:
إرسال تعليق