రూ.8000 కోట్ల ప్రాజెక్ట్ లో బందరు పోర్టు తొలి అడుగు !
الأربعاء، 23 سبتمبر 2026
000 Crore Project Andhra Pradesh Bandar Port First Step in ₹8 Goa Shipyard Limited Minister Kollu Ravindra expressed his happiness
మచిలీపట్నంలో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కొత్త యుద్ధ నౌకల తయారీ, మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తాజాగా ఆమోదం తెలపటంతో ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, కేబినెట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రూ.8,000 కోట్ల పెట్టుబడితో బందరు పోర్టు కేంద్రంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు జరిగితే స్థానికంగా ఉన్న నైపుణ్యం ఉన్న యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం చరిత్రలో ఇది మరో మైలురాయిగా నిలవబోతోందని తెలిపారు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినిరత్నా కేటగిరీ-1 పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్. గోవాలోని వాస్కోడిగామాలో ప్రధాన కేంద్రం ఉంది. 1957లో స్థాపించబడిన ఈ కంపెనీ ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ కోసం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్స్, ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్, ఫ్రిగేట్లు, పొల్యూషన్ కంట్రోల్ వెసెల్స్ వంటి అత్యాధునిక నౌకలు తయారు చేస్తోంది భారత నేవీకి కావాల్సిన వందలాది నౌకలను నిర్మించి అందించింది. ఇప్పుడు మొదటిసారి గోవా వెలుపల తూర్పు తీరంలో విస్తరణ చేపడుతోంది. మచిలీపట్నంలో దాదాపు 400 ఎకరాల్లో రెండు దశలుగా ఈ యుద్ధ నౌకల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ కేంద్రం ద్వారా 120 మీటర్ల పొడవు ఉన్న నౌకలు నిర్మించగలరు. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్‌కు అవసరమైన ఆధునిక యుద్ధ నౌకలు, పెట్రోల్ వెసెల్స్ తయారీతో పాటు మరమ్మతు సేవలు కూడా అందిస్తారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్‌ను బలోపేతం చేసి, స్థానిక యువతకు నైపుణ్య ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మచిలీపట్నం పోర్టు చుట్టూ డిఫెన్స్, మెరైటైమ్ హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ليست هناك تعليقات:
إرسال تعليق