హైదరాబాద్‌లో ఈకా మొబిలిటీ తొలి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. నిజాంపేట్-హైదర్‌నగర్‌లో స్కెడ్ రైడ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలతో పాటు సర్వీసింగ్, నిర్వహణ, విడిభాగాల సరఫరా సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ బిజినెస్ హెడ్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రోహిత్ శ్రీవాస్తవ తెలిపారు. హైదరాబాద్‌లో లాజిస్టిక్స్, ప్రయాణికుల రవాణా, డెలివరీ రంగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అవకాశాలు పెరుగుతున్నాయని స్కెడ్ రైడ్ యజమాని కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈకా ఏవీఐ 3డబ్ల్యూ కార్గో, ఏవీఐ 3ఎస్, ఏవీఐ 6ఎస్ ఎలక్ట్రిక్ ఆటోలను లాంచ్ చేశారు. వీటితో పాటు ఈకా ఎంఓఎం, 12ఎం కోచ్, లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులు, ఈకా 55టీ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్ అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
إرسال تعليق