తెలంగాణ లోని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల రంగాయపల్లిలో ఇంటి పైన తీసుకున లోన్ తీర్చలేక మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద్దబాల యాదగిరి నాగవ్వకి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు హరిప్రసాద్ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఇల్లు కట్టడానికి లోన్ తీసుకున్నారు. ఈ మధ్యనే హరిప్రసాద్ కు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. అప్పటి నుంచి సరిగా పని చేయలేక పోవడంతో ఇంటి ఈఎంఐ ఆగింది. దీంతో మనస్థాపానికి గురైన అతను బుధవారం రాత్రి వినాయక నిమజ్జనానికి అని వెళ్లి పొలం దగ్గర ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. తండ్రి యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.
ఇంటి లోన్ తీర్చలేక మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
الخميس، 24 سبتمبر 2026
crime Manoharabad Mandal Medak district Rangayapalli village telangana Young man commits suicide due to distress over inability to repay home loan
ليست هناك تعليقات:
إرسال تعليق