భారీ భారీ భూకంపం : రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు
الخميس، 24 سبتمبر 2026
Adıyaman Diyarbakır Magnitude 5.8 Recorded on Richter Scale Major Earthquake quake caused panic among the public Şanlıurfa
టర్కీలోని దియార్‌బకిర్, అదియమాన్, షాన్లియుర్ఫా సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైంది. ముఖ్యంగా దియార్‌బకిర్‌లో భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. భూకంపం సంభవించిన వెంటనే దాని తీవ్రతను 5.5గా అధికారులు అంచనా వేశారు. అనంతరం సవరించిన అంచనాల ప్రకారం తీవ్రత 5.8గా వెల్లడైంది. భూకంపం ప్రభావంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రకంపనలు షాన్లియుర్ఫాతో పాటు అదియమాన్, మలత్యా, దియార్‌బకిర్, గాజియాంటెప్ ప్రాంతాల్లో కూడా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత టర్కీ విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ ఏఎఫ్ఏడీ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఫీల్డ్ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق