పసిఫిక్‌ సముద్రంలో పోలో హరికేన్‌ : మెక్సికో తీర ప్రాంతాల వైపు కదులుతున్న తుపాను

الخميس، 24 سبتمبر 2026

Hurricane Polo in the Pacific international it remains very powerful Officials state that although the storm's intensity has decreased slightly Storm Moving Towards Mexican Coast

t f B! P L

సిఫిక్‌ సముద్రంలో బలంగా ఏర్పడిన 'పోలో' హరికేన్‌ మెక్సికో తీర ప్రాంతాల వైపు కదులుతోంది. తుపాను తీవ్రత కొంత తగ్గినా ఇంకా చాలా బలంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. తుపాను నేరుగా తీరాన్ని తాకే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ దాని ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పోలో' తొలుత కేటగిరీ-5 తుపానుగా కొనసాగింది. ప్రస్తుతం కేటగిరీ-4కి బలహీనపడింది. అయినా గాలుల వేగంలో పెద్దగా తగ్గుదల కనిపించలేదని అధికారులు తెలిపారు. అమెరికా నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కు చెందిన హరికేన్‌ హంటర్‌ విమానం తుపాను మధ్యలోకి వెళ్లి పరిశీలించింది. ఈ సమయంలో గంటకు సుమారు 285 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు గుర్తించింది. 'పోలో' నెమ్మదిగా వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో మెక్సికో నైరుతి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జాలిస్కో, కొలిమా, మిచోవాకాన్‌ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని, కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడొచ్చని హెచ్చరించారు. సముద్రంలో భారీ అలలు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  'పోలో' బలంగా ఉండటానికి సముద్రంలో పెరిగిన వేడి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పసిఫిక్‌ సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కాయి. సెప్టెంబర్‌ 19న పసిఫిక్‌లోని కీలక ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.05 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదైంది. 2015లో నమోదైన 3.02 డిగ్రీల రికార్డును ఇది అధిగమించింది. సముద్ర జలాలు వేడిగా ఉన్నప్పుడు తుపానులకు ఎక్కువ శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ