తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ శివారులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. దొంగతనం ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మల్లికార్జున స్వామి దేవాలయంలో చోరీ : సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ వైరల్
الجمعة، 3 يوليو 2026
Almaspur village in Yellareddypet Mandal CCTV Footage Goes Viral Rajanna Sircilla district telangana Theft at Mallikarjuna Swamy Temple
ليست هناك تعليقات:
إرسال تعليق