కోర్టులోనే భార్యను చితకబాదిన భర్త : సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
السبت، 26 سبتمبر 2026
Family Court in Maharajganj district Husband Brutally Beats Wife Inside Court Uttar Pradesh Video goes viral on social media
ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లా కేంద్రంలో ఉన్న ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలోనే ఓ వ్యక్తి తన భార్యను చితకబాదిన వీడియో వెలుగులోకి వచ్చింది. భరణానికి సంబంధించిన కేసు విచారణ కోసం కోర్టుకు వచ్చిన భార్యపై ఆమె భర్త, అతని అనుచరులు దారుణంగా దాడికి దిగారు. విచారణ ముగిసిన తర్వాత కోర్టు గది నుంచి బయటకు వచ్చిన మహిళ జట్టు పట్టుకుని, కింద పడేసి కొట్టడమే కాకుండా గొంతు నులిమారు. ఈ ఘటన ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. పురందర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమర్‌ధిరా నివాసి అయిన ప్రియా త్రిపాఠికి, బ్రిజ్ మంజ్ ప్రాంతానికి చెందిన మనీష్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భరణం కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రియ, ఆమె తండ్రి లక్ష్మీకాంత్, సోదరి ప్రియాంకతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. తండ్రి సాక్ష్యం ముగిసిన అనంతరం వారు కింది అంతస్తులోని హాలులోకి చేరుకోగా.. భర్త మనీష్ మిశ్రా తన సహచరులు ప్రిన్స్ మిశ్రా, సతీష్ మిశ్రాలతో కలిసి దాడికి పాల్పడ్డాడు. దాడి సమయంలో ప్రియను రక్షించేందుకు ముందుకు వచ్చిన ఆమె తండ్రి లక్ష్మీకాంత్, సోదరి ప్రియాంకపై కూడా నిందితులు దాడి చేసి కింద పడేశారు. ఆవరణలో గందరగోళం చెలరేగడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు వెనక్కి తీసుకోకపోతే ప్రాణాలు తీస్తామని నిందితులు బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాధితురాలి ఫిర్యాదు, లభించిన వీడియో ఆధారాల ప్రకారం సదర్ కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కోర్టు ఆవరణలోనే మహిళపై ఇటువంటి దాడి జరగడంపై స్థానికులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق