మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
السبت، 26 سبتمبر 2026
CM Revanth Reddy Manmohan Singh Should Be Awarded Bharat Ratna telangana unveiled a bronze statue of him at Wipro Circle in the Financial District
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్ వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ ఆర్థిక రంగంలో ఆయన సరళీకృత విధానాలు తెచ్చారని గుర్తు చేశారు. భారత్‌ను సంక్షోభం నుంచి దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గట్టెక్కించారని చెప్పారు. నాడుై ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణ బిల్లుపై సంతకం చేశారని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, మాజీ ఆర్ధిక సలహాదారు మోహన్ గురుస్వామి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق