మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ద్విచక్ర వాహనాలపై వెంబడించిన కొందరు యువకులు నడిరోడ్డుపై ఓ పోలీసు అధికారిని విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీసు అధికారిని స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుపై దాడి జరగడం నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఓ పోలీస్ అధికారి (35) తన వ్యక్తిగత కారులో మహిళా స్నేహితురాలితో కలిసి మన్‌కాపూర్ చౌక్ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో వారి కారు, నిందితుల ద్విచక్రవాహనం స్వల్పంగా ఢీకొనడంతో వివాదం చెలరేగింది. అధికారి కారును అడ్డగించిన యువకులు అనంతరం ఆయనతో వాగ్వాదానికి దిగారు. కారును ధ్వంసం చేయడంతో పాటు పోలీసును కారులోంచి బయటకు లాగారు. విచక్షణారహితంగా కొట్టుకుంటూ రోడ్డు అవతలి వైపునకు ఈడ్చుకెళ్లారు. ఆపై తీవ్రంగా గాయపడేలా దాడి చేశారు. రోడ్డుపై పదులకొద్దీ వాహనాలు వెళ్లినా, యువకులను నిలువరించేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. దాడి అనంతరం యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు కొంతమంది కలుగజేసుకుని బాధితుడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను హర్ష్ పవార్, గౌరవ్ ధిర్డే, సంయమ్ గణేశ్‌పురి, యాస్ ప్రతేకి, సత్యం షిర్కే, ప్రేమ్‌రాజ్ ధాకటే, ఆకాశ్ బోకాడే, నితిన్ గోఖలే, విక్కీ తెల్ఘారే, భూమి దేవ్ అలియాస్ సాగర్ బోక్డే, గణేశ్ ఉయికే, ప్రీతమ్ మోడేకర్, టికారామ్ బరాపాత్రేగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో కొందరిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని, నిందితుల వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసు అధికారిని విచక్షణారహితంగా కొట్టిన యువకులు : నెట్టింట చక్కర్లు కొడుతున్న దృశ్యాలు
الجمعة، 3 يوليو 2026
CCTV cameras captured the entire incident Footage Goes Viral maharashtra nagpur Youths Brutally Assault Police Officer
ليست هناك تعليقات:
إرسال تعليق