ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం తొమ్మిదో సమీక్ష సందర్భంగా జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ప్రసంగిస్తూ “ఉగ్రవాది అంటే ఉగ్రవాదే. ఉగ్రవాద చర్యలను సమర్థించేందుకు ఎలాంటి కారణాలు వెతకకూడదు. ఈ హంతక భావజాలాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా, నిబద్ధతతో కృషి చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి భారత్ ఏ విధంగా బలవుతోందో ఈ సందర్భంగా హరీశ్ ప్రపంచ దేశాలకు వివరించారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశంలో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాలు ఛిద్రమై, సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలు, వ్యూహాత్మక లెక్కలు లేదా మరే ఇతర నెపాలు చెప్పినా సరే ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడుల వెనుక ఉన్న వ్యూహకర్తలు, వారికి నిధులు సమకూర్చేవారు, ఆశ్రయం కల్పించే వారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీ చేసి చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాలంలో ఉగ్రవాదులు సరికొత్త టెక్నాలజీలను దుర్వినియోగం చేయడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రమాదకర సాంకేతిక సాధనాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటంలో ఐరాస సభ్య దేశాలు ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడం బాధాకరమని పేర్కొంది. అంతేకాకుండా, ఉగ్రవాద వ్యతిరేక పోరుపై అంతర్జాతీయంగా తీసుకురావాల్సిన సమగ్ర చట్టం దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించకూడదు : ఐరాస వేదికగా మరోసారి ప్రపంచ దేశాలకు స్పష్టం చేసిన భారత్
الخميس، 2 يوليو 2026
India reiterates its stance to the world at the UN Ninth review of the Global Counter-Terrorism Strategy Terrorism must not be tolerated in any form
ليست هناك تعليقات:
إرسال تعليق