హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్ సిటీలోని 'నాలెడ్జ్ సిటీ' వేదికగా టెస్లా తన సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అధికారికంగా ప్రారంభించింది. భారత మార్కెట్లో టెస్లాకు ఇది 5వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ కావడం విశేషం. ఈ సరికొత్త ఫెసిలిటీలో టెస్లాకు చెందిన సరికొత్త 2026 మోడల్ Y ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ మరియు మోడల్ Y L ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శనకు ఉంచారు. టెస్లా అడ్వైజర్ల సమక్షంలో గైడెడ్ టూర్స్ మరియు ఇంటరాక్టివ్ ప్రొడక్ట్ డెమోల ద్వారా టెస్లా వాహనాల అధునాతన టెక్నాలజీ, సేఫ్టీ సిస్టమ్స్, పర్ఫార్మెన్స్ మరియు డిజైన్ ఫిలాసఫీని విజిటర్స్ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. షోరూమ్‌తో పాటు, టెస్లా ఇండియా డెలివరీ మరియు సర్వీసింగ్ కార్యకలాపాలను నగరంలోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా ఫెసిలిటీ నుండి ప్రారంభించింది. దీనివల్ల కస్టమర్లకు మెరుగైన సర్వీస్ సపోర్ట్ లభించనుంది. ఈ సరికొత్త ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో హైలైట్‌గా నిలిచిన ఈ 5 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది. Y ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ లో 2,138 లీటర్ల కార్గో స్పేస్ ఉంది. కేవలం 5.9 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 500 కిలోమీటర్ల (WLTP క్లెయిమ్డ్) రేంజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 50.89 లక్షలు. జూలై 2026 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. టెస్లా మోడల్ Y L ఫ్యామిలీ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మోడల్ త్రీ-రో (3 Rows), 6 సీటర్ లేఅవుట్‌తో, మెరుగైన ప్యాసింజర్ స్పేస్‌తో వస్తోంది. దీని కార్గో కెపాసిటీ 2,539 లీటర్లు. కేవలం 5.0 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 681 కిలోమీటర్ల (WLTP సర్టిఫైడ్) మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 61.99 లక్షలు. ఈ రెండు మోడల్స్ టెస్లా ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే జూన్ 30, 2026 లోపు తమ కార్లను ఆర్డర్ చేస్తారో, వారికి టెస్లా కంపెనీ ఉచితంగా 'వాల్ కనెక్టర్ హోమ్ చార్జర్'ను కాంప్లిమెంటరీగా అందించనుంది.
హైటెక్ సిటీలో గ్రాండ్‌గా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన టెస్లా
الأربعاء، 17 يونيو 2026
automobile business hyderabad Knowledge City in Hi-Tech City Madapur telangana Tesla launched a grand experience center in the hi-tech city
ليست هناك تعليقات:
إرسال تعليق