ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ అధికారులు స్మార్ట్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. అధికారులు స్మార్ట్‌ఫోన్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, వారివద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లను తీసుకుని, అన్నింటినీ కలిపి బహిరంగంగా ధ్వంసం చేశారు. ఈ అంశంపై తాలిబన్ మిలిటరీ కోర్టులు అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. ఉన్నతాధికారుల నుంచి జనరల్ స్టాఫ్ వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. వీరెవరూ స్మార్ట్‌ఫోన్లు వాడటానికి వీల్లేదు. సుప్రీం లీడర్‌కు మాత్రమే ఫోన్ వాడేందుకు అనుమతించారు. ఈ ఆదేశాలు అధికారికంగా వెలువడటం మాత్రమే కొత్త. కానీ, కొంతకాలంగా ఈ ఫోన్ల వాడకంపై అనేక ఆంక్షల్ని తాలిబన్లు అనధికారికంగా అమలు చేస్తున్నారు. తాజా ఆదేశాల ప్రకారం ఎవరైనా అధికారి ఫోన్ వాడుతూ పట్టుబడితే ఆ ఫోన్‌ను వెంటనే ధ్వంసం చేస్తారు. అలాగే, కోర్టు నియమాలకు అనుగుణంగా, షరియా చట్టాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అధికారుల వద్ద ఉన్న ఫోన్లను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. వందలాది ఫోన్లను ఒకేచోట చేర్చి ధ్వంసం చేశారు. ఫోన్లు వాడటం వల్ల కొన్ని కీలక డాక్యుమెంట్లు లీక్ కావడం, ఉత్పత్తి తగ్గిపోవడం, పనులు మందగించడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Random Post
إجمالي مرات مشاهدة الصفحة
Configure Archive
بحث هذه المدونة الإلكترونية
AsSencse 2
About Us
AP TO TG COMPUTER TECH
ver-1
1
Footer Menu Widget
About Me
نموذج الاتصال
No Thumbnail
Categories
Main Tags
Translate
#Advertisement
Featured Posts
{getFeatured} $label={recent} $region={Andhra Pradesh}
#Advertisement
8/related/default
ليست هناك تعليقات:
إرسال تعليق