విలువలతో కూడిన రాజకీయం, ప్రమాణాలు సిద్ధాంతాలతో కూడిన రాజకీయం మళ్లీ రావాలి !

الأحد، 1 مارس 2026

and principles should come back Andhra Pradesh happy to launch the book Akshara Nirajanam Kavita Sankalnam for Atalji Politics with values standards telangana Venkaiah Naidu

t f B! P L


తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు జరగటం సంతోషకరమన్నారు. అటల్‌జీకి అక్షర నిరాజనం కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తనకు పితృసామానులైన వాజ్‌పేయికి నివాళులర్పించడం తన బాధ్యత అని తెలిపారు. వాజ్‌పేయి నాయకత్వంలో అఖిల భారత జనతా పార్టీకి అధ్యక్షుడిగా పని చేసే మహాభాగ్యం తనకు దక్కిందని చెప్పుకొచ్చారు. ప్రజా హృదయ సామ్రాట్‌గా అటల్‌జీని పిలుచుకుంటారని వివరించారు. వాజ్‌పేయి ఎందరో నాయకుల్ని తయారు చేశారని వెల్లడించారు. నేటి యువత ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. యువత వాజ్‌పేయి లాంటి నాయకులుగా తయారవ్వాలి ఎదగాలని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం అభ్యంతరకరంగా మాట్లాడటం నేడు గొప్పతనంగా భావిస్తున్నారని, అది కాదు గొప్పతనం ఈ విషయం యువత తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. తాను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదని ఒక మిత్రుడికి చెప్పానని తెలిపారు. పత్రికల్లో, టీవీల్లో మీరు పెద్దగా కనిపించడం లేదని ఆ మిత్రుడు అమెరికాలో అడిగారని ప్రస్తావించారు. పత్రికల్లో, టీవీల్లో అనుచితంగా మాట్లాడే వాళ్లని చూపిస్తున్నారని, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లని చూపిస్తున్నారని, ఆవిధంగా మాట్లాడటం తనకు రాదని, అలాంటి విమర్శలు తనకు చేతకాదని ఆ మిత్రుడికి చెప్పానని గుర్తుచేశారు. వాజ్‌పేయి వంటి మహానేత జీవితాలు ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఆదర్శవంతమైన రాజకీయ నాయకులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. నేటి రాజకీయ నాయకుల ప్రవర్తన వాళ్ల మాటలు చూసి యువత రాజకీయాల్లోకి రావాలంటేనే ఆలోచిస్తున్నారని, ఉత్సాహంగా ముందుకు రాలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. విలువలతో కూడిన రాజకీయం ప్రమాణాలు సిద్ధాంతాలతో కూడిన రాజకీయం మళ్లీ రావాలని ఆకాంక్షించారు. నేడు సిద్ధాంతాలు లేవని.. అంతా రాద్దాంతమేనని తెలిపారు. పదవుల కోసం పార్టీలు మారే రాజకీయాలు మంచిది కాదన్నారు. పదవుల కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లుగా నేతలు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. ఒకప్పుడు కశ్మీర్‌కి వెళ్లాలంటే అక్కడి ప్రభుత్వం అనుమతి తీసుకుని వెళ్లాలని, శ్యాం ప్రసాద్ ముఖర్జీ అందుకు ఒప్పుకోలేదని ప్రస్తావించారు. తన దేశంలోకి వెళ్లటానికి తనకు అనుమతి ఎందుకంటూ ఆయన కాశ్మీర్‌లో ప్రవేశించారని గుర్తుచేశారు. అక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీని అరెస్ట్ చేశారని అన్నారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ వెంటనే తనతో తీసుకెళ్లిన వాజ్‌పేయికి ఈవిషయం గురించి చెప్పారన్నారు. అలాంటి రాజకీయ నేతలు మనందరికీ ఆదర్శం కావాలని సూచించారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన ఎందరో మహానీయులు మనకి ఆదర్శం కావాలని వెంకయ్య నాయుడు దిశానిర్దేశం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ