మార్చి 11 నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా సేల్ ప్రారంభం కానుంది. దీంతోపాటు త్వరలో బడ్జెట్, మిడ్ రేంజ్‌లో అనేక మోడల్స్ అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే గత నెలలో బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. అయితే బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా.. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను అందిస్తుంది. దీంతోపాటు 50MP కెమెరా, 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లైట్ గ్రీన్, బ్లాక్, లైట్ వైలెట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. ఈ శాంసంగ్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఇది 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఆటోఫోకస్, 10x డిజిటల్ జూమ్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉంది. వీటితోపాటు ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గైరోస్కోప్, జియో మాగ్నటిక్ సెన్సర్, యాక్సిలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్‌లు ఉన్నాయి.
ホーム
/
technology
/
మార్చి 11 నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా సేల్ ప్రారంభం
الأحد، 1 مارس 2026
many models will be available in the budget and mid-range soon Samsung Galaxy S26 Ultra sale starts from March 11 technology
ليست هناك تعليقات:
إرسال تعليق