మహారాష్ట్రలోని నాగపూర్, కటోల్ ప్రేలుడు పదార్ధాలు తయారీ పరిశ్రమ ఎస్బీఎల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగపూర్ లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాముందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిశ్రమలో డిటోనేటర్లతో పాటు భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో, 30 మందికి పైగా పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి.
నాగపూర్ ఎస్ బీఎల్ కంపెనీలో భారీ పేలుడు : 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
الأحد، 1 مارس 2026
15 killed explosives manufacturing industry Katol maharashtra many seriously injured Massive explosion at SBL Company in Nagpur
ليست هناك تعليقات:
إرسال تعليق