ఇరాన్ సుప్రీం లీడర్ గా మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆయన భౌతికంగా ఎక్కడా కనిపించడం లేదు. ఖమేనీకి తీవ్ర గాయాలయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరికొన్న మీడియా సంస్థలు ఆయన కోమాలో ఉన్నట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా ఓ భారీ ఆఫర్ ఇచ్చింది. మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెబితే వాళ్లకి 10 మిలియన్ డాలర్లు (రూ.92 కోట్లకు పైగా) ఇస్తామని ప్రకటించింది. యూఎస్ విదేశాంగ శాఖ ఎక్స్ లో ఈ ప్రకటన చేసింది. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ, ఆయన కార్యలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతాధికారి అలీ లారిజానితో పాటు మరికొందరి పేర్లను అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా వీళ్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సిహిస్తున్నారని తెలిపింది. వీళ్లకు సంబంధించిన ఆచూకి ఉంటే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా తమకు తెలియజేయాలని తెలిపింది. సమాచారం అందించిన వాళ్లకి 10 మిలియన్ డాలర్లు నగదు అందిస్తామని చెప్పింది. సమాచారం ఇచ్చిన వాళ్లకి పునరావాసం కూడా కల్పిస్తామని పేర్కొంది. ఇదిలాఉండగా ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఖమేనీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఎక్కడున్నారనేది ఇంకా క్లారిటీ లేదు.
మొజ్తాబా ఆచూకీ చెబితే 10 మిలియన్ డాలర్లు : అమెరికా ఎక్స్ లో ప్రకటన
السبت، 14 مارس 2026
$10 Million Reward for Information on Mojtaba's Whereabouts international US Announcement on X US Department of State
ليست هناك تعليقات:
إرسال تعليق