చిలగడదుంప - ఆరోగ్య ప్రయోజనాలు

السبت، 14 مارس 2026

aids in the proper functioning of the thyroid gland and C arogyam containing vitamins A D food health Sweet Potatoes – Health Benefits

t f B! P L


చిలగడదుంప అనేక వ్యాధులకు నివారణగా మరియు శారీరక దృఢత్వానికి మేలైన ఆహారంగా నిలుస్తుంది. ఇతర దుంప జాతులతో పోలిస్తే ఇందులో పోషక విలువలు చాలా ఎక్కువ. దీనిలో విటమిన్ ఏ, డీ, సీ పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలకు గని వంటిది. శ్వాసకోశ సమస్యలు, కీళ్ల నొప్పులు, అల్సర్ ఉన్నవారికి వైద్యులు తరచుగా దీనిని సిఫార్సు చేస్తారు. ఇందులో ఉండే విటమిన్ బీ-6 జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, గుండె జబ్బుల నుండి మనల్ని కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ డీ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎముకలు, పళ్లు మరియు నరాల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని అడ్డుకుని ముడతలను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి చిలగడదుంప ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో ఉండే పీచు పదార్థం, రెసిస్టెంట్ స్టార్చ్ శరీరంలో త్వరగా గ్రహించబడవు. సాధారణ కార్బోహైడ్రేట్లకు బదులుగా దీనిని తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు కరిగే వేగం పెరుగుతుంది. ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంచుతుంది. చిలగడదుంపను ఉడకబెట్టి లేదా కాల్చుకుని తినడం వల్ల పూర్తి పోషకాలు లభిస్తాయి. అరటిపండు కంటే ఇందులో పొటాషియం ఎక్కువ, ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అయితే, ఏదైనా అతిగా తింటే ప్రమాదమే. శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగితే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఉండే ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ లేదా కాలేయ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ