ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంక్రాంతి సంబరాల కేసులో గుంటూరులో సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు జైలుకు తరలించారు. 2023లో సంక్రాంతి సందర్భంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. అయితే ఈ లక్కీ డ్రా పేరుతో అక్రమాలకు పాల్పడి భారీగా డబ్బులు దండుకున్నారని జనసేన పార్టీ జిల్లా ఇంచార్జి గాదె వెంకటేశ్వర్లు అంబటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు, పీటీ వారెంట్ తీసుకుని జైలులో ఉన్న అంబటిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో అంబటికి ధర్మాసనం రిమాండ్ విధించింది. కాగా అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదు అయ్యాయి. సీఎం చంద్రబాబును దూషించిన కేసుతో పాటు గుంటూరులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులోనూ ఆయనకు జడ్జి రిమాండ్ విధించారు. దీంతో రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. అయితే ఈ రెండు కేసుల్లోనూ అంబటికి బెయిల్ మంజూరు అయింది. ఇంతలో సంక్రాంతి సంబరాల కేసులో ఆయన రిమాండ్ పడింది. దీంతో రాజమండ్రి జైలుకు తరలించారు.
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ : జైలుకు తరలించిన పోలీసులు
الخميس، 12 فبراير 2026
Ambati Rambabu remanded for 14 days Andhra Pradesh civil judge in Guntur Police sent to jail Sankranthi celebrations case
ليست هناك تعليقات:
إرسال تعليق