పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం విధించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్

الأحد، 4 يناير 2026

Directorate General of Civil Aviation bans the use of power banks It stated that this decision was taken in the interest of passenger safety national technology

t f B! P L


విమాన ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జింగ్ చేసేందుకు పవర్ బ్యాంకులను వినియోగించడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిషేధం విధించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై విమానం గాల్లో ఉండగా ప్రయాణికులు తమ ఫోన్లు లేదా ఇతర గాడ్జెట్లను పవర్ బ్యాంకుల ద్వారా చార్జ్ చేయకూడదు. అయితే పవర్ బ్యాంకులను కేవలం హ్యాండ్ బ్యాగుల్లో మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. చెక్-ఇన్ బ్యాగుల్లో వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విమానంలో ప్రయాణించేటప్పుడు పవర్ బ్యాంకులు స్విచ్ ఆఫ్ చేసి ఉంచాలని డీజీసీఏ స్పష్టం చేసింది. బ్యాటరీలు పేలిపోవడం లేదా మంటలు చెలరేగే ప్రమాదం ఉండటంతో ఈ కఠిన నిబంధనలు తెచ్చారు. విమానయాన సంస్థల సిబ్బంది ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందే తెలియజేయాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల్లో పవర్ బ్యాంకులు వేడెక్కి పొగలు రావడం, మంటలు వ్యాపించడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగాయి. పవర్ బ్యాంకుల్లో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలు ఒత్తిడికి గురైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు పేలిపోయే ప్రమాదం ఉంది. దీనిని సాంకేతికంగా "థర్మల్ రన్‌అవే" అంటారు. అందుకే వీటిని విమానం లోపల వాడటం సురక్షితం కాదని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు తమ వెంట పవర్ బ్యాంకులు తెచ్చుకోవచ్చు కానీ వాటిని వినియోగించకూడదు. ప్రయాణ సమయంలో ఎవరివద్దనైనా పవర్ బ్యాంక్ లేదా ఎలక్ట్రానిక్ పరికరం బాగా వేడెక్కినా, పొగ వచ్చినా వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఇండిగో, ఎయిర్ బుసాన్ విమానాల్లో పవర్ బ్యాంకుల వల్ల జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ