ఎలక్ట్రిక్ గీజర్ - జాగ్రత్తలు

الأحد، 4 يناير 2026

Electric Geyser - Precautions Ensure there are no leaks in the geyser geyser should not be switched on when there is no water in it Ventilation is very important for geysers

t f B! P L


చలి కాలంలో చాలా మంది ఇళ్లలో ఎలక్ట్రిక్ గీజర్లనువాడుతుంటారు. ఇవి మనకు వేడి నీటిని అందిస్తున్నప్పటికీ వీటి వల్ల ముప్పు కూడా ఎక్కువే. గీజర్ల వాడకంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గీజర్లలో ఎలాంటి లీకేజీ లేకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా చాలా మంది చిన్న లీకేజే కదా అని నిర్లక్ష్యం తీసుకుంటారు. ఇది పేలుడుకు దారితీసే అవకాశముంది. గీజర్ పేలడానికి మరో కారణం అధిక పీడనం. గీజర్ థర్మోస్టాట్ సెన్సార్ పనిచేయకపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుంది. నీరు వేడికావడం నిర్ణీత ఉష్ణోగ్రతకు చేరాక ఈ సెన్సార్ గీజర్‌కు విద్యుత్‌ను నిలిపేస్తుంది. ఈ సంకేతంతో పవర్ ఆఫ్ చేయాలి. చాలా మంది రాత్రంతా గీజర్లను ఆన్‌లో ఉంచుతారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల నీరు చాలా వేడిగా మారుతుంది. దీనివల్ల పీడనం ఎక్కువై గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది. గీజర్లో నీరు లేనప్పుడు దానిని ఆన్ చేయకూడదు. ఇది గీజర్ వేగంగా పనిచేయకపోవడానికి దారితీస్తుంది. దీని వల్ల పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. గీజర్లలో అమర్చిన ప్రెజర్ వాల్వ్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలి. లేదంటే ఈ వాల్వ్ దెబ్బతినడం వల్ల పీడనం ఎక్కువై గీజర్ పేలుడుకు కారణమవుతుంది. గీజర్ పగిలిపోయేటట్టు ఏవైనా సంకేతాలు కనిపిస్తే వెంటనే దాని సంబంధిత స్విచ్‌ను ఆఫ్ చేయాలి. ఒకవేళ అది గ్యాస్ కనెక్టెడ్ అయితే గ్యాస్ సరఫరా నిలిపివేయాలి. ఆ తర్వాత వెంటనే ప్రొఫెషనల్ మెకానిక్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం వహిస్తే ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. గీజర్లకు వెంటిలేషన్ చాలా ముఖ్యం. కాబట్టి సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసేటప్పుడు గీజర్‌ను ఎప్పుడూ ఆఫ్ చేసి ఉంచాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆన్‌ చేయడం మరవద్దు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ