29న 'పల్లె పండుగ 3.0'కు శ్రీకారం
الأحد، 27 سبتمبر 2026
'Palle Panduga 3.0' to Launch on September 29 Andhra Pradesh CM Nara Chandrababu Naidu DCM Pawan Kalyan will officially launch
ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పల్లె పండుగ 3.0' కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ఉదయగిరి వేదికగా సెప్టెంబర్ 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 11,085 కోట్ల విలువైన గ్రామీణాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 5,391 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 5,694 కోట్లుగా ఉంది. ఇందులో VB-G RAM G పథకం కింద రూ. 1,750 కోట్లు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రూ. 3,800 కోట్లు, నాబార్డ్, సాస్కీ తదితర నిధుల ద్వారా మరో రూ. 2,000 కోట్ల మేర పనులను ప్రభుత్వం చేపట్టనుంది. రహదారుల నిర్మాణం: పల్లెల్లో రాకపోకల విస్తరణ కోసం రూ. 2,700 కోట్ల వ్యయంతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, రూ. 7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల పనులను చేపట్టనున్నారు. పాడి రైతులకు చేయూత: పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22,000 మినీ గోకులాలు నిర్మిస్తారు. ఉద్యానవనాలు & మురుగు కాలువలు: ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రూ. 225 కోట్ల ఖర్చుతో 50,000 ఎకరాల్లో తోటల పెంపకం పనులు, రూ. 110 కోట్లతో 1,000 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్స్ (మురుగు కాలువలు) నిర్మించనున్నారు. గ్రామ మౌలిక వసతులు: రూ. 200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ నూతన భవనాలు, రచ్చబండల నిర్మాణ పనులను పూర్తి చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి పరిశ్రమకు దన్నుగా నిలుస్తూ మౌలిక వసతులను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ليست هناك تعليقات:
إرسال تعليق