చైనాలో సెప్టెంబర్ 23న షియోమి 18 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్
الأربعاء، 23 سبتمبر 2026
Snapdragon 8 Elite Gen 6 series chipset technology Xiaomi 18 Pro Max Smartphone Launching in China on September 23
చైనాలో సెప్టెంబర్ 23న షియోమి 18 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను మొదట చైనాలో లాంచ్ చేసిన తర్వాత ఇదే సంవత్సరంలో గ్లోబల్ మార్కెట్ లో కూడా విడుదల చేయనున్నట్లు షియోమీ తెలిపింది. షియోమీ ఈ ఫోన్ ను Snapdragon 8 Elite Gen 6 Series చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యే మొదటి ఫోన్ గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఇది 2nm టెక్నాలజీతో క్వాల్కమ్ నిర్మించిన ఏజంటిక్ AI చిప్ సెట్. ఈ చిప్ సెట్ ఏకంగా 5.0 GHz శక్తి తో కంప్యూటర్ మాదిరి సూపర్ ఫాస్ట్ పెర్ఫామెన్స్ అందించే శక్తి కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం చైనా అఫీషియల్ సైట్ లో ఈరోజు నుంచి ప్రీ బుకింగ్స్ కూడా షియోమి మొదలు పెట్టింది. అదే సైట్ లో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు కూడా అందించింది. ఈ ఫోన్ లో వెనుక కెమెరా తో పాటు పెద్ద సెకండరీ రియర్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఈ ఫోన్ ను మరింత ప్రీమియం గా మరియు ఫ్యూచరిస్టిక్ గా చేసింది.
ليست هناك تعليقات:
إرسال تعليق