హరీష్ రావు ధనదాహంతో జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టు మార్చారు !

الأحد، 4 يناير 2026

Harish Rao shifted the project from Jurala to Srisailam due to his greed for money Kavitha demanded that if the government has sincerity towards Telangana Telangana Jagruthi President Kavitha

t f B! P L


తెలంగాణ లోని సూర్యాపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ వ్యక్తిగతంగా హరీశ్ రావును ఒక మాట అన్నందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు. "ఆ అంశంపై వాకౌట్ చేసి, మళ్లీ సభకు రావొచ్చు కదా ? బీఆర్ఎస్‌లో హరీశ్ ఓ గ్రూపును తయారు చేస్తున్నారు. బయట సభలు పెడుతూ చట్టసభల్లో మాట్లాడే అవకాశాన్ని వదులుకోవడం సరైంది కాదు" అని ఆమె వ్యాఖ్యానించారు. హరీశ్ ధనదాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని, ఆయన నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత విమర్శలు చేస్తూ ప్రతిపక్షం లేని సభలో కృష్ణా జలాలపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. గత ప్రభుత్వాన్ని నిందించడంపై ఉన్న శ్రద్ధ, కృష్ణా నీటి వాటాలపై చర్చ జరపడంలో లేదని విమర్శించారు. తెలంగాణకు చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను రద్దు చేయాలని, ఆల్మట్టి డ్యాం ఎత్తు తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా నీటి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఆమె ప్రశ్నించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ