టాటా ఎరిస్ విడుదల : అక్టోబర్ 11 నుంచి డెలివరీలు మొదలు

الجمعة، 25 سبتمبر 2026

automobile available in six different color options Deliveries to Begin on October 11 Featuring numerous changes compared to the Tigor Tata Aris Launch technology

t f B! P L

టాటా మోటార్స్ కొత్త 'టాటా ఎరిస్' మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 5.29 లక్షలు ప్రారంభ ధరతో విడుదలైన ఈ కారుకు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా, అక్టోబర్ 11 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి. టిగోర్‌తో పోలిస్తే అనేక మార్పులు చేసిన ఈ కారు ముందు భాగం టియాగో స్ఫూర్తితో, సైడ్ ప్రొఫైల్‌లో స్మూత్ కర్వ్స్‌తో సొగసుగా కనిపిస్తుంది. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్స్, వాటిని అనుసంధానించే లైట్ స్ట్రిప్, మధ్యలో టాటా లోగో మరియు టెయిల్‌గేట్‌పై ప్రముఖంగా ‘ఏరిస్’ లెటరింగ్‌ను అందించారు. ఈ కారు ఆరు విభిన్న కలర్ ఆప్షన్లలో, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. కారు లోపల ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఫ్రీ-ఫ్లోటింగ్ 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను అమర్చారు. దీని కింద ప్రాథమిక నియంత్రణల కోసం రోటరీ నాబ్‌లు, బటన్లు ఇచ్చారు. లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. దీనిలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, హై-బీమ్ అలర్ట్, ESP, TPMS, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్లైండ్ వ్యూ మానిటరింగ్, రోల్‌ఓవర్ మిటిగేషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను జోడించింది. అంతేకాకుండా 360-డిగ్రీ కెమెరా సెటప్, ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ రికార్డర్‌ను కూడా అందించడం విశేషం. 

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ