ホーム
/
technology
/
అంతరిక్షంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్లు : సన్‌క్యాచర్ పేరుతో ప్రయోగాలు
الجمعة، 25 سبتمبر 2026
Experiments Under 'Project Suncatcher' Google AI Data Centers in Space Operating AI data centers on Earth requires vast amounts of electricity and water technology
భూమిపై పెరుగుతున్న విద్యుత్, ఇంధన కొరతకు చెక్ పెట్టేలా ఏఐ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నేరుగా అంతరిక్షంలోకి తీసుకెళ్లే దిశగా గూగుల్ 'ప్రాజెక్ట్ సన్‌క్యాచర్' పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. భూమిపై ఏఐ డేటా సెంటర్లు పనిచేయాలంటే భారీగా కరెంట్, నీరు అవసరమవుతాయి. భవిష్యత్తులో ఈ ఇబ్బందులను అధిగమించడానికి అంతరిక్షమే సరైన వేదికని గూగుల్ భావిస్తోంది. భూ వాతావరణం వెలుపల తక్కువ కక్ష్యలో తిరిగే ఉపగ్రహాలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం సోలార్ ఎనర్జీని పొందగలవు. దీనివల్ల భూమి మీద కంటే ఎక్కువుగా సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్తులో ఈ చిన్న ఉపగ్రహాలన్నింటినీ ఒక నెట్‌వర్క్‌లా అనుసంధానించి భారీ ఏఐ వర్క్‌లోడ్స్‌ను అంతరిక్షం నుంచే నిర్వహించాలన్నది గూగుల్ అసలు ప్లాన్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గూగుల్ తన స్వంత టీపీయూ చిప్స్ పనితీరును పరీక్షించడానికి ఒక ప్రోటోటైప్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలోని తీవ్రమైన ఉష్ణోగ్రతలు, రేడియేషన్, రాకెట్ ప్రయాణ సమయంలో ఏర్పడే విపరీతమైన కంపనాలను ఏఐ హార్డ్‌వేర్ ఎలా తట్టుకుంటుందనే అంశాలపై డేటాను సేకరిస్తుంది. అంతరిక్షంలో గాలి ప్రసరణ ఉండదు కాబట్టి.. ఏఐ చిప్స్ ఉత్పత్తి చేసే వేడిని తగ్గించడం అతిపెద్ద సవాల్. వాక్యూమ్ వాతావరణంలో కేవలం రేడియేటర్ల ద్వారా మాత్రమే వేడిని బయటకు పంపగలం. దీనికోసం గూగుల్ ప్రత్యేకమైన హీట్ పైప్స్, రేడియేటర్ల కలయికతో కూడిన సరికొత్త కూలింగ్ సిస్టమ్‌ను రూపొందించింది. ఇప్పటికే భూమిపై థర్మల్ వాక్యూమ్ ఛాంబర్లలో ఈ కూలింగ్ టెక్నాలజీని పరీక్షించిన గూగుల్.. ఇప్పుడు అంతరిక్షంలో దీని కచ్చితమైన ఫలితాలను టెస్ట్ చేయబోతోంది. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక రీసెర్చ్ ప్రయోగం మాత్రమే అయినప్పటికీ.. భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లు ఎలా పనిచేస్తాయనేదానికి ఇది తొలి అడుగు కానుంది.
ليست هناك تعليقات:
إرسال تعليق