యువత వికసిత భారత్‌కు వెన్నెముక లాంటి వారు : 'సేవా సంకల్ప్ యాత్ర' ప్రతినిధులతో ప్రధాని మోడీ వర్చువల్ గా ముఖాముఖి

الجمعة، 25 سبتمبر 2026

Kashi is my second Karmabhumi national PM Modi interacts virtually with 'Seva Sankalp Yatra' representatives Vadnagar is my birthplace Youth are the backbone of a 'Viksit Bharat'

t f B! P L

గుజరాత్ లోని మెహసానా జిల్లా వడ్ నగర్ నుండి వారణాసి వరకు పయనిస్తున్న 'సేవా సంకల్ప్ యాత్ర' ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ముఖాముఖి నిర్వహించారు. వారి సేవా నిరతిని ప్రశంసిస్తూ, ఈ యాత్రికుల ప్రయత్నాలు ఎంతో స్పూర్తిదాయకమని కొనియాడారు. నాకు వడ్ నగర్ జన్మభూమి అయితే కాశీ నా రెండవ కర్మభూమి. కాశీలో బాబా విశ్వనాథుడి ఆశీస్సులు, వడ్ నగర్‌లో హాటకేశ్వర్ మహాదేవుని ప్రేమానురాగాలు నాకు లభించాయి అని ప్రధాని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ప్రయాణ ఇబ్బందులు ఉన్నప్పటికీ యాత్రికులు ఎంతో ఉత్సాహంతో ఈ సుదీర్ఘ సేవా ప్రచారాన్ని కొనసాగించడాన్ని ఆయన అభినందించారు. నిస్వార్థ సేవా భావంతో పనిచేసినప్పుడే 'ఆయుష్మాన్ భారత్' వంటి ప్రజా సంక్షేమ పథకాలు పురుడుపోసుకుంటాయని ప్రధాని తెలిపారు. రాజకీయం, ఎన్నికలు, పాలన అనేవి వాటి స్థానంలో అవి ఉంటాయని, అయితే అందరి ప్రాథమిక లక్ష్యం దేశ నిర్మాణమే కావాలని నొక్కి చెప్పారు.2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని, నేటి యువత వికసిత భారత్‌కు వెన్నెముక లాంటి వారని మరియు భవిష్యత్ లబ్ధిదారులు కూడా వారేనని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ