ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్ మేయర్ మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మొదలు పెట్టిన 30 నిమిషాల తర్వాత మమ్దానీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ''ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడి చేసినప్పుడు నీ భార్య రమా దువాజీ సమర్థించలేదా?'' అంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా క్లిప్‌లను ఎత్తిచూపించారు. ''బాధితుడిని.. దురాక్రమణదారుడిని తారుమారు చేసినందుకు మీకు సిగ్గుగా ఉండాలి.'' అని మండిపడ్డారు. ''మీరు ఇజ్రాయెల్‌పై జాతి హత్య ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎప్పుడూ జాతి హత్యకు పాల్పడలేదు. జాతి హత్యను నివారించింది. ఒకవేళ మేము ఆపకపోయింటే మమ్దానీ మిత్రులైన హమాస్ అదే చేసి ఉండేవారు.'' అని వ్యాఖ్యానించారు. గత నెల రోజులుగా మమ్దానీ సోషల్ మీడియాలో నెతన్యాహుపై విమర్శలు చేస్తున్నారు. మంగళవారం కూడా 'భయంకరమైన జాతి నిర్మూలనకు సూత్రధారి'' అని అభివర్ణించారు. నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా బెదిరించారు. దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ నెతన్యాహు కూడా ప్రతి సవాల్ విసిరారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు రాగానే సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. నెతన్యాహు ప్రసంగం ప్రారంభించగానే డజన్ల కొద్దీ ప్రతినిధులంతా జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక ఇరాన్ వాకౌట్ చేస్తూ ఖాళీ బల్లపై సులేమానీ చిత్రపటాన్ని ఉంచేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సభ నుంచి వెళ్లిపోయిన వారిని ఉద్దేశించి 'నైతిక పిరికివాళ్లు' అంటూ నెతన్యాహు సంబోధించారు. అయితే నెతన్యాహు మద్దతుదారులు మాత్రం సభలో నిలబడి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. దీంతో మిగిలిన నిరసనకారులంతా వెళ్లిపోవాలని నెతన్యాహు సూచించారు. ఈ సభలో విడిచి వెళ్లని నైతిక పిరికివాళ్లు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు.
మా దేశంపై దాడి చేస్తే నీ భార్య రమా దువాజీ సమర్థించలేదా? : మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
الجمعة، 25 سبتمبر 2026
"Didn't your wife international Iranian delegation walked out after placing a portrait of Soleimani on the empty desk. Netanyahu lashes out at Mamdani Notably Rama Duwaji support the attack on our country?"
ليست هناك تعليقات:
إرسال تعليق