గణేష్ నిమజ్జనోత్సవం : రాత్రంతా నడవనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

الأربعاء، 23 سبتمبر 2026

from the 25th to the 27th MMTS Trains to Run All Night Ganesh Immersion hyderabad South Central Railway has announced

t f B! P L

ణేష్ నిమజ్జన సమయంలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రంతా ఎనిమిది ప్రత్యేక ఎంఎం​టీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గణేష్ నిమజ్జనాల నేపథ్యంలో భక్తుల భద్రత, సౌకర్యం దృష్టిలో పెట్టుకుని ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఈ రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారిక సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రచురించింది. ట్రెయిన్ నెం. GSH-1 సికింద్రాబాద్ నుంచి రాత్రి 11 గంటల 50 నిమిషాలకు స్టార్ట్ అయి 12 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ కు చేరుకుంటుంది. GHL-2 నాంపల్లి నుంచి రాత్రి 12 గంటల 30 నిమిషాలకు బయల్దేరి 1 గంట 20 నిమిషాలకు లింగంపల్లి చేరుకుంటుంది. GLH-3 అయితే 1 గంట 50 నిమిషాలకు లింగంపల్లి నుంచి బయల్దేరి 2 గంటల 40 నిమిషాలకు నాంపల్లి చేరుకుంటుంది. ట్రెయిన్ నెం. GHS-4 తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు లింగంపల్లి నుంచి స్టార్ట్ అయి 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. GHL-5 చూస్తే రాత్రి 11 గంటల 10 నిమిషాలకు నాంపల్లి నుంచి స్టార్ట్ అయి 11 గంటల 55 నిమిషాలకు లింగంపల్లిలో ఆగుతుంది. ట్రైయిన్ నెం. GLF-6 చూస్తే రాత్రి 12 గంటల 10 నిమిషాలకు లింగంపల్లి నుంచి స్టార్ట్ అయి 1 గంట 50 నిమిషాలకు ఫలక్ నుమాకు చేరుకుంటుంది. అలాగే GFS-7 చూస్తే రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఫలక్ నుమా నుంచి బయల్దేరి 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. GSH-8 తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయి 4 గంటల 40 నిమిషాలకు నాంపల్లికి చేరుకుంటుంది. ఈ ఎనిమిది ప్రత్యేక ఎంఎం​టీఎస్ రైళ్లు ప్రతి స్టేషన్ లో ఆగనున్నాయి. ఇక హైదరాబాద్ లో దాదాపు 1.5 లక్షల గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ