తెలుగు సినీ చరిత్రలో 'కలర్ ఫోటో' తర్వాత మళ్ళీ ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో సంచలనం సృష్టించడం ''జిగ్రీస్'' చిత్రంతోనే సాధ్యమైంది. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలో ఉన్నా, ఓటీటీలో మాత్రం ''జిగ్రీస్'' తన హవా కొనసాగిస్తోంది. రెండు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో నంబర్ 1 మరియు నంబర్ 2 పొజిషన్లలో ట్రెండ్ అవుతూ, ఈ చిత్రం ఒక రికార్డును నెలకొల్పింది. కేవలం ఒక్క భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కృష్ణ బురుగుల నటనను చూసిన ప్రేక్షకులు "కార్తీక్ క్యారెక్టర్ లో జీవించేశావు అన్న" అంటూ మెసేజ్ లతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మరియు డైలాగ్ డెలివరీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. యూత్ ఈయన్ని "ఓటీటీ స్టార్" గా కిరీటం కట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ''జిగ్రీస్'' క్లిప్స్, కృష్ణ నటనపై ప్రశంసలే కనిపిస్తున్నాయి. డల్లాస్ నుండి గల్లీ వరకు అందరూ ఇప్పుడు కృష్ణ బురుగుల గురించే మాట్లాడుకుంటున్నారు.
ఓటీటీలో హవా కొనసాగిస్తోన్న 'జిగ్రీస్' !
الخميس، 15 يناير 2026
'Jigris' continues its dominance on OTT platforms After 'Color Photo' in Telugu cinema history Andhra Pradesh cinema telangana
ليست هناك تعليقات:
إرسال تعليق