ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఉన్నతాధికారులతోపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎదుట 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో దండకారణ్యం స్పెషల్ జోన్, ఏవోబీలో విధులు నిర్వహిస్తున్న మావోయిస్టులతోపాటు బహ్మరాఘడ్ ఏరియా కమిటీలోని సభ్యులు సైతం ఉన్నారు. వీరిపై రూ.1.41 కోట్ల రివార్డు ఉందని పోలీస్ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టమైన భరోసా కల్పించడంతో వీరంతా లొంగిపోయారని బీజాపూర్ జిల్లా ఎస్పీ జీతేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యుడు లక్కు కరం అలియాస్ అనిత్ (32), ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు లక్ష్మీ మాద్వి (28), చిన్ని సోది అలియాస్ శాంతి (28).. వీరు ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ప్రకటించామని చెప్పారు. మరో 13 మందికి.. ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, 19 మందికి రూ. 2 లక్షలు, మరో 14 మందికి రూ. లక్ష చొప్పున రివార్డుగా ప్రకటించామన్నారు. లొంగిపోయిన 52 మంది మావోయిస్టుల్లో 49 మందికి మొత్తం రూ. 1.41 కోట్లు ప్రకటించామని వివరించారు. అయితే ఈ లొంగిపోయిన మావోయిస్టులు అందరికి తొలుత రూ. 50 వేలు చొప్పున అందజేస్తామని జిల్లా ఎస్పీ యాదవ్ వెల్లడించారు.
52 మంది మావోయిస్టుల లొంగుబాటు
الخميس، 15 يناير 2026
52 Maoists surrender Among them were 21 women Maoists AOB region Bijapur district in Chhattisgarh national surrendered individuals included Maoists operating in the Dandakaranya Special Zone
ليست هناك تعليقات:
إرسال تعليق