రాజకీయ అవసరాల కోసం ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలి !

السبت، 19 سبتمبر 2026

Encouraging defections for political expediency must stop He criticized both BRS and Congress stating there is little difference between them telangana Union Minister and BJP leader G. Kishan Reddy

t f B! P L

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ తీర్పు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెంపపెట్టు వంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును పక్కనపెట్టి రాజకీయ అవసరాల కోసం ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు పెద్దగా తేడా లేదని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వంటి నేతలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన దానం నాగేందర్‌కు సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చిందని అన్నారు. రాజకీయ అవసరాల కోసం పార్టీ మారే సంస్కృతిని ఇకనైనా నిలిపివేయాలని హితవు పలికారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఫిరాయింపు చట్టాలను ఉల్లంఘించిన పార్టీలేనని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలని మాట్లాడుతున్నారని, అలాంటప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వ్యక్తికి కాంగ్రెస్‌ తరఫున లోక్‌సభ టికెట్‌ ఎలా ఇచ్చారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికత రాహుల్‌ గాంధీకి ఉందా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వ్యవహారశైలి 'నువ్వు పీనుగలు తింటే.. నేను ఏనుగులను తింటా' అన్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుకు విలువ ఇవ్వకుండా రెండు పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని ఆరోపించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ