రష్యా, ఇరాన్‌ల ఆర్థిక వనరులను దెబ్బతీసేందుకు రూపొందించిన ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం 30 రోజుల్లోగా అమల్లోకి రానుంది. ఈ నూతన చట్టం రష్యా ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చే ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుంది. రష్యా నాయకత్వం, ఇంధన రంగం, రక్షణ పరిశ్రమలు మరియు రష్యన్ వాణిజ్య నౌకల కార్యకలాపాలకు సహకరించే వ్యక్తులు, సంస్థలపై అమెరికా నిఘా మరియు ఆంక్షలు ఉంటాయి.రష్యాతో పాటు ఇరాన్‌పై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను కూడా ఈ చట్టం మరింత కాలం పొడిగిస్తుంది. ఈ చట్టంలో అత్యంత కీలకమైన నిబంధన రష్యన్ ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం ఇవ్వడం.రష్యా నుంచి అత్యధికంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే ఐదు అగ్ర దేశాల నుంచి వచ్చే వస్తువులపై 100% వరకు సుంకాలు విధించే అవకాశం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది.చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే ఏ దేశంపైనా 100% టారిఫ్ ఆటోమేటిక్‌గా పడదు. టారిఫ్ విధించాలా వద్దా, ఎంత శాతం విధించాలి అన్నది పూర్తిగా అధ్యక్షుడి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నిర్దిష్టమైన జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా కాంగ్రెస్‌కు ధ్రువీకరణ ఇచ్చి కొన్ని దేశాలకు మినహాయింపు ఇచ్చే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా నుంచి అత్యధికంగా ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాలలో చైనా, భారత్‌లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అమెరికా వైపు నుంచి ఢిల్లీ, బీజింగ్‌లపై దౌత్యపరమైన, వాణిజ్యపరమైన ఒత్తిడి పెరగనుంది.భారత్‌పై తక్షణమే 100% టారిఫ్‌లు అమలు అవుతాయని భావించాల్సిన అవసరం లేదు. ఇది అమెరికా చేతికి ఒక దౌత్యపరమైన ఆయుధంగా మాత్రమే ఉపయోగపడుతుంది.
ホーム
/
international
/
లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026పై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్
السبت، 19 سبتمبر 2026
designed to undermine the economic resources of Russia and Iran Donald Trump Signs the ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026’ international
ليست هناك تعليقات:
إرسال تعليق