చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఒక నవజాత శిశువుకు జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సు చేసిన నిర్లక్ష్యం వల్ల శిశువు తన వేలును కోల్పోవాల్సి వచ్చింది. డిసెంబర్ 25వ తేదీన ఒక మహిళకు సిజేరియన్ ద్వారా మగబిడ్డ జన్మించాడు. పుట్టిన రెండు గంటల తర్వాత, సర్జరీ సమయంలో పొరపాటున శిశువు ఎడమ చేతి మధ్య వేలు కట్ అయ్యిందని వైద్యులు తండ్రికి చెప్పారు. బొడ్డు తాడు కట్ చేస్తున్న సమయంలో శిశువు ఒక్కసారిగా వేళ్లు కదిలించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆ నర్స్ పేర్కొంది. అయితే, ఇది పూర్తిగా నర్సు నిర్లక్ష్యమేనని స్థానిక ఆరోగ్య కమిషన్ తేల్చింది. వేలు కట్ అయిన వెంటనే శిశువును 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ వేలును తిరిగి అతికించే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం శిశువు వేలులో స్టీల్ సూదులు ఉన్నాయని, ఆ నొప్పికి బిడ్డ నిరంతరం ఏడుస్తూనే ఉన్నాడని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యురాలైన నర్సును సస్పెండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం మొదట 1 లక్ష యువాన్ల (సుమారు ₹11-12 లక్షలు) పరిహారం ఆఫర్ చేసింది. చివరకు జనవరి 6న ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, పరిహారం మొత్తాన్ని వెల్లడించలేదు. చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసుపత్రి భద్రతా ప్రమాణాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బొడ్డు తాడు కట్ చేయబోయి వేలు కట్ చేసిన నర్సు !
الخميس، 15 يناير 2026
000 yuan in compensation eastern China hospital management initially offered 100 international Jiangsu province Nurse cuts baby's finger while attempting to cut the umbilical cord
ليست هناك تعليقات:
إرسال تعليق